సాగర తీరాన.. ‘జయహో నారీమణి’
సాగర తీరాన.. ‘జయహో
నారీమణి’
ఇంటర్నెట్‌డెస్క్: మహిళ
అంటే అబల కాదు.. పురుషులకు ఏ మాత్రం తీసిపోదు.. ‘జయహో నారీమణి’ అంటోంది పూరీ
సాగరతీరం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి
సుదర్శన్ పట్నాయక్ శిష్యులు కొందరు ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ప్రత్యేక సైకత
శిల్పాలను రూపొందించారు. ‘పురుషులతో సమానంగా మహిళలు కూడా ధైర్యవంతులు’, ‘నారీశక్తి’
అని సందేశానిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శిల్పాలు చూపరులను
ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇక సైకత శిల్పి
సుదర్శన్ పట్నాయక్ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సైకత శిల్పాన్ని
రూపొందించారు. ప్రస్తుతం ఆయన బహ్రెయిన్‌లో ఉన్నారు. అక్కడి సముద్ర తీరంలో
బహ్రెయిన్ సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్ అధ్యక్షురాలు హెచ్‌ఆర్‌హెచ్ సబికా
బింత్ అల్ ఖలీఫా సైకత శిల్పంతో పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోను ఆయన తన
ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ‘లింగ వివక్షను రూపుమాపుదాం.. మహిళా సాధికారతకు
పాటుపడుదాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని పట్నాయక్ ట్వీట్‌లో
పేర్కొన్నారు.
Comments
Post a Comment