కనిపిస్తే కబ్జా!
కనిపిస్తే కబ్జా! యథేచ్ఛగా చెరువు శిఖం భూముల ఆక్రమణ జోరుగా కొనసాగుతున్న నిర్మాణాలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ప్రజలు ఫిర్యాదు చేస్తేనే అక్రమాలు వెలుగులోకి ఈనాడు, వరంగల్, న్యూస్టుడే, మడికొండ చెరువులు, కుంటలను ఇష్టారాజ్యంగా ఆక్రమించేస్తున్నారు. యథేచ్ఛగా ప్లాట్లు చేసి భవనాలు కట్టేస్తున్నారు. తూములను రాళ్లతో పూడ్చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఆక్రమణదారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, జయశంకర్, మహబూబాబాద్ జిల్లాల్లోని నగరాలు, పట్టణాల పరిసరాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. ఫలితంగా అందరి ఆస్తిగా ఉండాల్సిన జల వనరులు ఒకరిద్దరి స్వార్థంతో ఉనికి కోల్పోతున్నాయి. రాళ్లతో పూడ్చేస్తున్నారు: వరంగల్ అర్బన్ ్ల మడికొండ వద్దగల సల్ల చెరువు స్వరూపం మారుతోంది. కొందరు వ్యక్తులు గ్రానైటు పరిశ్రమల నుంచి భారీ బండరాళ్లు తీసుకొచ్చి చెరువును పూడ్చేస్తున్నారు. ఇప్పటికే మత్తడి రాళ్లను సైతం తొలగించారు. ఈ అన్యాయాన్ని చూడలేక గ్రామస్థులు ధర్నా చేపట్టి, అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కదిలారు. ఆక్రమణదారులపై తాజాగా కేసు నమోదు చేశారు....
Comments
Post a Comment