రాలిపోయిన సిరిమల్లె పువ్వు అతిలోక సుందరికి అశ్రునివాళి తన అందం అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన లెజెండ్, అతిలోక సుందరి శ్రీదేవి (54) ఇకలేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె తీవ్రమైన గుండెపోటుతో దుబాయ్‌లో కన్నుమూశారు. శ్రీదేవి భర్త బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్, తన ప్రియురాలు అంతర మోతీవాలాని మంగళవారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో హాజరైన శ్రీదేవి శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోని కపూర్, కూతురు ఖుషి పక్కనే ఉన్నట్లు చెప్పారు. 1963 ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి అసలు పేరు ‘శ్రీ అమ్మా యాంగేర్ అయ్యపాన్’. తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ఓ పత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1975 చిన్నతనంలో తునాయివన్ సినిమాతో సినీ రంగంలోకి ప్రేవేశించిన శ్రీదేవి.. భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు. తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం ‘మా నాన్న నిర్దోషి’. తెలుగు తెరపై అగ్రహీరోలందరితోనూ ఆడిపాడి అతి...